Sunday, May 19, 2024

రెస్క్యూ ఆపరేషన్‌కు మళ్లీ అడ్డంకి.. మరో నెలవరకు టన్నెల్‌లోనే బాధితులు!

spot_img

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కూలీల రెస్క్యూ ఆపరేషన్‌కు మళ్లీ అడ్డంకి వచ్చింది. కూలిన శిథిలాల నుంచే సొరంగం లోపలికి డ్రిల్‌ వేసేందుకు యత్నించగా.. ఇవాళ డ్రిల్‌ మిషన్‌ బ్లేడ్‌లు సొరంగం శిథిలాల్లో ఇరుక్కుపోవడంతో ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. బాధితులను బయటికి తీసుకొచ్చేందుకు గత 13 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ అపరేషన్‌కు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి.

Also Read.. ఈ  ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముందా.. రాహుల్ గాంధీ..?

ఇంతకుముందు సొరంగం పైనుంచి డ్రిల్‌ వేసి బాధితులను బయటికి తీసేందుకు యత్నించారు. కానీ, మధ్యలో గట్టి బండరాయి తగలడంతో ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఇదిలా ఉండగా.. బాధితులకు ఎలాంటి హాని జరగకుండా బయటికి తీసుకురావడమే కష్టసాధ్యంగా మారిందని అంతర్జాతీయ టన్నెలింగ్‌ ఎక్స్‌పర్ట్‌ ఆర్నాల్డ్‌ డిక్స్‌ అన్నారు. మ్యాన్యువల్‌గా సొరంగాన్ని తవ్వడమే ఇక ఆఖరి మార్గమని, ఇందుకు దాదాపు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నదన్నారు.

Also Read.. మైనంపల్లికి మతిభ్రమించింది. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు

మరోవైపు ప్రస్తుతం 6 అంగుళాల పైపు ద్వారా బాధితులకు ఆహారం అందజేస్తున్నారు. కాగా, ఈ నెల 12న కొండచరియలు విరిగిపడటంతో సిల్క్యారా టన్నెల్‌లో కొంత భాగం కూలింది. ఆ టన్నెల్‌లో పనిచేస్తున్న 41 మంది కూలీలు బయటికి వచ్చే మార్గం లేక అందులోనే చిక్కుకుపోయారు.

Latest News

More Articles