Friday, May 17, 2024

డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1 వరకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం

spot_img

డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1 వరకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఈ 10 రోజుల పాటు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమన్నారు. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా విచ్చేస్తే వారికి మాత్రమే టిక్కేట్లు జారీ చేస్తామని తెలిపారు. తిరుమలలో వసతి సౌకర్యం పరిమితంగా వుండడంతో భక్తులుకు తిరుపతిలోనే వసతి సౌకర్యం పొందాలని విజ్ఞప్తి చేశారు. సర్వదర్శన భక్తులుకు పది రోజులకు సంభందించి 4.25 లక్షల టోకెన్లను 22వ తేది నుండి తిరుపతిలో జారీ చేస్తామన్నారు. టోకెన్ పొందిన భక్తులు 24 గంటల ముందుగా మాత్రమే తిరుమలకు రావాలన్నారు. దర్శన టోకెన్ కలిగిన భక్తులుకు మాత్రమే తిరుమలలో వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. టోకెన్ లేని భక్తులు తిరుమలకు విచ్చేసినా… వారికి వసతి,దర్శన సౌకర్యం లభించదన్నారు. 23వ తేదీ ఉదయం 9 గంటలకు స్వర్ణరథం ఉరేగింపు నిర్వహిస్తామని తెలిపారు ఈఓ ధర్మారెడ్డి.

ఇది కూడా చదవండి: IPL-2024: రేపు IPL ప్లేయర్స్ వేలం

Latest News

More Articles