Friday, May 17, 2024

ఎస్ఆర్ నగర్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 12 మంది యువకులు అరెస్ట్

spot_img

హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఎస్ఆర్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ ని నార్కోటిక్ బ్యూరో స్వాధీనం చేసుకున్నది. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సీ పిల్స్  ను కొందరు యువకులు తీసుకువచ్చారు. పట్టుబడిన వారంతా కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వారేనని నార్కోటిక్ బ్యూరో తెలిపింది.

12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అరెస్టయిన వారిలో ఉన్నారు. ప్రేమ్ చంద్ బర్త్ డే కోసం గోవా నుంచి సంపత్ అనే యువకుడు డ్రగ్స్ తెప్పించినట్లు విచారణలో గుర్తించారు. 30 మంది కోసం డ్రగ్ పార్టీని ప్రేమ్ చంద్ ఏర్పాటు చేసాడని అధికారులు తెలిపారు.

Latest News

More Articles