Thursday, May 2, 2024

క‌ర్ణాట‌కలో మాస్కు త‌ప్ప‌నిస‌రి

spot_img

క‌రోనా స‌బ్ వేరియంట్ జేఎన్.1 క‌ల‌వ‌రం సృష్టిస్తోంది. తాజాగా కేర‌ళ‌లో న‌లుగురు, ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌లో ఒక‌రు మ‌ర‌ణించారు. దీంతో క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వం అలర్టైంది. 60 ఏండ్లు పైబ‌డిన వృద్ధులు, గుండె స‌మ‌స్య‌ల‌తో పాటు ఇత‌ర దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారు త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండు రావు తెలిపారు.

క‌రోనా కేసుల పెరుగుతున్న నేప‌థ్యంలో నిన్న(ఆదివారం) ఆరోగ్య శాఖ స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చించింద‌ని మంత్రి తెలిపారు. త్వ‌ర‌లోనే క‌రోనా నివార‌ణ‌కు సంబంధించిన విధివిధానాలు తెలుపుతామన్నారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు సిద్ధంగా ఉండాల‌ని ఆదేశించామ‌న్నారు. కేర‌ళ స‌రిహ‌ద్దులో ఉన్న మంగ‌ళూరు, చామ‌రాజ‌న‌గ‌ర్, కొడ‌గు జిల్లాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఈ ప్రాంతాల్లో క‌రోనా టెస్టుల సంఖ్య పెంచుతామ‌న్నారు. శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు ముందు జాగ్ర‌త్త‌గా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు.

ఇది కూడా చదవండి: డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1 వరకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం

Latest News

More Articles