Sunday, June 16, 2024

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో వారికే తెలియదు

spot_img

వందేళ్లలో జరగని అభివృద్ధిని పదేళ్లలోనే కేసీఆర్ చేసి చూపించారని అన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్) పోరాట ఫలితంగానే తెలంగాణ వచ్చిందన్నారు. 14 ఏళ్లు ఉద్యమాలు చేసి పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇవాళ( సోమవారం) మిర్యాలగూడ  నియోజకవర్గంలో జరిగిన ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు.

అసత్య ప్రచారాలతో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు ప్రశాంత్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లోని 14 వేల కోట్ల అప్పులు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అప్పులు చేశాడో ప్రజలకు వివరించాలన్నారు.ఇచ్చిన హామీలను నెరవేర్చలేని రండ రేవంత్ రెడ్డి అని తీవ్రంగా విమర్శించారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన కేసీఆర్‌ను రండ అని అంటున్న రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి అమలు చేయ లేని రండవి నువ్వే అని అన్నారు. రాబోయే ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం నీ గురువు చంద్రబాబు వల్లనే కాలేదు. రేవంత్ రెడ్డి నిన్ను ప్రజలే బొంద పెట్టే రోజులు ముందున్నాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగే సంసారం కాదన్నారు. ఇది ఎప్పుడు కూలుతుందో వారికే తెలియదన్నారు ప్రశాంత్ రెడ్డి.

ఇది కూడా చదవండి: 16 నెలల తర్వాత తొలి టోర్నీలోనే గోల్డ్‌ సాధించిన వినేశ్‌ ఫొగట్‌

 

Latest News

More Articles