Friday, May 17, 2024

ఫ్యాక్టరీలో దూరిన 15 అడుగుల కింగ్ కోబ్రా.. భయపెడుతున్న వీడియో

spot_img

పామును చూడగానే చాలామంది భయపడుతుంటారు. అది ఆమడ దూరంలో ఉండగానే కాళ్లు, చేతులు ఆడవు. అటువంటిది భారీ కింగ్ కోబ్రా కళ్ల ముందు ఉంటే.. ఇక అంతే సంగతులు. అలాంటి ఓ 15 అడుగుల కింగ్ కోబ్రా ఫ్యాక్టరీ పరిసరాల్లో కనిపించింది. దాంతో కార్మికులంతా ఉరుకులు పరుగులు పెట్టారు.

తమిళనాడులోని కడయం మున్సిపాలిటీ పరిధిలోని గోవిందపేరి సమీపంలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ పరిసరాల్లో 15 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా కనిపించింది. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో ఉన్న వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. వారు వెంటనే అటవి శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వచ్చి స్నేక్ క్యాచర్స్ బృందంతో కలిసి కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. బుసలు కొడుతూ మీదకు వస్తుంది. ఎట్టకేలకు దానిని ఓ సంచిలో బంధించి ఆ తర్వాత అడవిలో వదిలేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇటీవలి కాలంలో భారీ సర్పాలు జనావాసాల్లోకి చొరబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వాటిని కొందరు భయం లేకుండా పట్టుకుని అటు పాములను, ఇటు జనాలను కూడా రక్షిస్తున్నారు.

Read Also: నేడే వరల్డ్ కప్ తుది సమరం.. గెలిస్తే రూ. 33 కోట్లు, ఓడినా కోట్లే

Latest News

More Articles