Saturday, May 11, 2024

యూకేలో మంత్రి కేటీఆర్‌.. పిల్ల‌వాడిని నిద్రపుచ్చే వీడియో వైరల్

spot_img

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్..  యూకేలోని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సెల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, తెలంగాణ అసోసియేష‌న్ ఆఫ్ యూకే ప్రెసిడెంట్ ర‌త్నాక‌ర్ ఇంటికి వెళ్లారు. ర‌త్నాక‌ర్ ఫ్యామిలీతో చాలా స‌మ‌యాన్ని గ‌డిపిన కేటీఆర్.. ర‌త్నాక‌ర్ కుమారుడు ర‌ణ‌వ్‌ను ఎత్తుకు ఆడించారు. భుజంపై వేసుకుని నిద్ర‌పుచ్చే ప్ర‌య‌త్నం చేశారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే, మంత్రి కేటీఆర్ త‌మ ఇంటికి రావ‌డం ప‌ట్ల ఎన్ఆర్ఐ ర‌త్నాక‌ర్ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఈ మేరకు కేటీఆర్ వీడియోను ట్వీట్ చేశారు. డైన‌మిక్ నేత కేటీఆర్.. త‌మ కుటుంబాన్ని ఆశీర్వ‌దించార‌ని త‌న ట్వీట్‌లో రత్నాకర్ తెలిపారు. ఈ సందర్భంగా త‌మ కుటుంబానికి అలౌకిక‌మైన ఆనందాన్ని క‌లిగించిన మంత్రి కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పేందుకు త‌న‌కు మాట‌లు రావడం లేదన్నారు.

ఈ వీడియోను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. తనపై చూపిన అభిమానం పట్ల కేటీఆర్ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ.. స్మైలింగ్ ఎమోజీని పోస్టు చేశారు.

Latest News

More Articles