Friday, May 17, 2024

రైతులకు శుభవార్త.. జూన్‌ 4న కేరళకు నైరుతి రుతు పవనాలు..!

spot_img

న్యూఢిల్లీ: ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా భారత్‌ను నైరుతి రుతు పవనాలు పలుకరించనున్నాయి. జూన్‌ 4న ఈ పవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం 83.5 సెం.మీ దాకా నమోదు కావొచ్చని ఐఎండీ తెలిపింది. ఎల్‌ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ దేశమంతటా సాధారణ వర్షపాతం ఆశించవచ్చని చెప్పింది.

సాధారణంగా ఏటా జూన్‌ 1న ఈ రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. కాగా, గత అయిదేండ్లలో ఏర్పడ్డ వాతావరణ పరిస్థితుల కారణంగా.. గతేడాది మాత్రమే రుతుపవనాలు పలుకరించాయి.  భారతదేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతు పవనాలు.. ఈ ఏడాది సకాలంల రానున్నాయని ఐఎండీ ప్రకటించడంపై రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

2019 రుతుపవనాల సీజన్‌లో 971.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా,  2020లో 961.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. 2021లో 874.5 మిల్లీమీటర్లు, 2022లో 924.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మహాపాత్ర పేర్కొన్నారు.

Latest News

More Articles