Saturday, May 18, 2024

అభివృద్ధి, సంక్షేమానికి మన గ్రామాలు చిరునామా కావాలి..!

spot_img

నందిపేట్ మండల సర్పంచులతో అభివృద్ధి పనులపై ఎమ్మేల్యే జీవన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే మన ప్రచారస్త్రాలు కావాలి. పల్లెల సమగ్రాభివృద్ధి తోనే గాంధీజీ కలలుకన్న గ్రామస్వరాజ్యం, గ్రామాల ప్రగతి, ప్రజా జీవన ప్రమాణాలలో పురోగతి సీఎం కేసీఆర్ ఆశయం. ఆయన ఆశయ సాధనకోసం కలిసి ముందుకు సాగుదాం
మీ గ్రామాలలో ఇంకా సమస్యలు ఉంటే చెప్పండి.

తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటా. ఎన్ని నిధులు మంజూరు చేయడానికైనా సిద్ధం. ఇప్పటికే చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలి. అభివృద్ధి, సంక్షేమానికి మన గ్రామాలు చిరునామా కావాలి. మన పథకాలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలి. సర్పంచులు ఇంటింటికీ వెళ్లి అభివృద్ధిపై ప్రచారం చేయాలి. ప్రజలను ఓట్లు అడిగే హక్కు మనకు తప్ప మరెవరికీ లేదు. మూడోసారి నేనే గెలుస్తా,హ్యాట్రిక్ సాధిస్తా’ అని అన్నారు జీవన్ రెడ్డి.

Latest News

More Articles