Sunday, May 19, 2024

చిరంజీవి – శ్రీదేవి సినిమాపై వివాదం.. స్పందించిన నిర్మాణ సంస్థ

spot_img

హైదరాబాద్‌: ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ కాపీ రైట్స్‌ విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ స్పందించింది. ఆ సినిమాపై పూర్తి హక్కు తమకే ఉందని అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ పెట్టింది. తమ బ్యానర్ లో 1990లో చిరంజీవి – శ్రీదేవి జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో  ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాను తెరకెక్కించినట్లు పేర్కొంది.

Also Read.. నాందేడ్‌ ఆసుపత్రిలో ఆగని మరణాలు.. 8 రోజుల్లో 108 మంది మృతి

ఈ సినిమాకు సంబంధించిన కథ, కథనం, పాత్రలు.. ఇలా అన్నింటిపై కాపీరైట్‌ హక్కులు తమకే ఉన్నాయని తెలిపింది. దీనికి సంబంధించిన రీమేక్‌లు, ప్రీక్వెల్స్‌, సీక్వెల్స్‌, వెబ్‌సిరీస్‌లు తీసే హక్కు కేవలం తమకే ఉందని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.

Also Read.. సర్దార్ పటేల్ ఒక్కడేనా.. తెలంగాణలో తోపులు లేరా.. అమిత్ షా ఏంటీ నీ బలుపు

తాము ఎవరికీ హక్కులు ఇవ్వలేదని, కాపీరైట్‌ హక్కులను ఉల్లంఘిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని  వైజయంతి మూవీస్‌ పేర్కొంది. 1990 మేలో విడుదలైన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది.

Latest News

More Articles