Saturday, April 27, 2024

నాందేడ్‌ ఆసుపత్రిలో ఆగని మరణాలు.. 8 రోజుల్లో 108 మంది మృతి

spot_img

మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలు ఆగడం లేదు. ఇటీవల 48 గంటల వ్యవధిలోనే 31 మంది మృతిచెందడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా గడిచిన 8 రోజుల్లో మరో 108 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లోనే 11 మంది రోగులు మరణించారు.  ఈ ఘటనను బాంబే హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. జాతీయ మానవహక్కుల కమిషన్‌ (NHRC) కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

Also Read.. సర్దార్ పటేల్ ఒక్కడేనా.. తెలంగాణలో తోపులు లేరా.. అమిత్ షా ఏంటీ నీ బలుపు

అక్టోబరు నెల ఆరంభంలో ఇదే ఆసుపత్రిలో 24 గంటల్లో 24 మంది మరణించారు. మృతుల్లో 12 మంది శిశువులున్నారు. అయితే, ఔషధాల కొరత, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆసుప్రతిలో రోగులు మృతిచెందుతున్నరన్న ఆరోపణలను ఆసుపత్రి డీన్‌ శ్యామ్‌ వాకోడే తోసిపుచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే చనిపోయారని తెలిపారు.

Latest News

More Articles