Wednesday, May 8, 2024

ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్..ఎప్పటినుంచో తెలుసా?

spot_img

ప్రముఖ ఈకామర్స్ ఫ్లాట్ ఫాం ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ డేట్స్ ను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ కొనసాగుతున్నట్లు తెలిపింది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గ్రుహోపకరణాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్ షిప్ యూజర్లు ఒకరోజు ముందుగానే అంటే మే 2 నుంచే ఈ సేల్లో పాల్గొనవచ్చని తెలిపింది.

బిగ్ సేవింగ్ డేస్ సేల్లో భాగంగా ఎస్బీఐ కార్డు హోల్డర్లు కొనుగోళ్లపై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ తన వెబ్ సైట్లో పేర్కొంది. ఫ్లిప్ కార్ట్ పే లేటర్ ఆప్షన్ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. వీటిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను కూడా అందించనుంది. యూపీఐ లావాదేవీలపై కూడా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే కంపెనీ ఆఫరస్ ను ఇంకా రివీల్ చేయలేదు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: మహిళలూ బంగారం కొనండి.. భారీగా పడిపోతున్న పసిడి ధరలు.!

Latest News

More Articles