Wednesday, May 8, 2024

మహిళలూ బంగారం కొనండి.. భారీగా పడిపోతున్న పసిడి ధరలు.!

spot_img

బంగారంకొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీకో శుభవార్త. బంగారం ధరలకు బ్రేకులు పడుతున్నాయి. పసిడి రేటు భారీగా దిగివస్తుంది. ఐదు వారాల ర్యాలీకి అడ్డుకట్టపడింది. బంగారం కొనాలన్నవారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పవచ్చు. ఈమధ్య కాలంలో బంగారం ధరలు భారీ పెరిగిన విషయం తెలిసిందే. దీంతో పసిడిని కొనేందుకు కొనుగోలుదారులు భయపడ్డారు. అయితే ఇప్పుడు క్రమంగా బంగారం ధరలు దిగివస్తున్నాయి. బంగారం ధరలు ఎంత తగ్గాయో తెలుసుకుందాం.

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ భయాలు తగ్గడం, అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు అంచాలపై స్పష్టత రావడం అంశాలే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గతవారంలో బంగారం ధరల్లో బలమైన ప్రాఫిట్ బుకింగ్ నెలకొంది. దీంతో బంగారం ధరలు భారీగా పడిపోయానని చెప్పవచ్చు. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ. 2024 ఎక్స్ ఫైరీ రూ. 71,486 వద్ద ముగిసింది. 10గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. ఏప్రిల్ 12నాటి రూ. 73,958 గరిష్ట్ర స్థాయి నుంచి చూసినట్లయితే..బంగారం ధర ఏకంగా రూ. 2472వరకు దిగివచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఇది సానుకూల అంశమే కాగా బంగారం ధర దాదాపు 3.35శాతం పతనమైంది.

ఇక హైదరాబాద్ లో నేడు రూ. 66,650వద్ద ఉంది. అదే 24క్యారెట్ల బంగారం ధర అయితే రూ. 72,710 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర విషయానికొస్తే రూ. 54,530వద్ద ఉండగా..విజయవాడ, విశాఖలో కూడా దాదాపు ఇవే రేట్లు పలుకుతున్నాయి.

ఇది కూడా చదవండి: JEE మెయిన్స్ ఆలిండియా టాపర్ రైతు బిడ్డ.!

Latest News

More Articles