Thursday, May 9, 2024

JEE మెయిన్స్ ఆలిండియా టాపర్ రైతు బిడ్డ.!

spot_img

చదువుతో పేదరికాన్ని జయించవచ్చని నిరూపించాడు ఈ రైతు బిడ్డ. మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతు బిడ్డ జేఈఈ మెయిన్స్ ఆలిండియా మొదటి ర్యాంకు సాధించాడు. మహారాష్ట్రలోని వాశిం జిల్లా బెల్ఖేడ్ గ్రామానికి చెందిన రైతు బిడ్డ నీల్ క్రుష్ణ గజారే జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో దేశంలోని మొదటి ర్యాంకును సాధించాడు. ఈ పరీక్షల కోసం రోజుకు పదిగంటలకు పైగానే చదవినట్లు నీల్ తెలిపారు. నీల్ క్రీడల్లో కూడా రాణిస్తున్నాడని విలువిద్యలో జాతీయ స్థాయి టోర్నీలో పాల్గొన్నాడని ఆయన తండ్రి నిర్మల్ గజార్ చెప్పారు. ఐఐటీ ముంబైలో చదువుకుని, సైంటిస్ట్ కావడం తన లక్ష్యమని నీల్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వచ్చే నెల జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

ఇది కూడా చదవండి: కోల్ కతాపై పంజాబ్ ఘనవిజయం..8 వికెట్ల తేడాతో గెలుపు.!

Latest News

More Articles