Tuesday, May 7, 2024

విషాదం..చేతికి వచ్చిన పంట ఎండిపోవడంతో ఓ రైతు ఆత్మహత్య.!

spot_img

పచ్చని తెలంగాణలో..చిచ్చు మొదలైంది. పదేండ్లపాటు సంతోషంగా బతికిన అన్నదాతలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పండించిన పంట చేతికిరాక..చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నారు రైతన్నలు. తాజాగా జనగామ జిల్లాకు చెందిన రైతు ఉచ్చేంతల శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెట్టిన పెట్టుబడి రాక అప్పులపాలై వ్యవసాయ బావి వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే..
తరిగోప్పుల మండలం సోలిపురం గ్రామానికి చెందిన ఉచ్చేంతల శ్రీనుకు అనే రైతుకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ రైతుగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో అప్పు చేసి 4 ఎకరాలలో వరి పంట సాగు చేయగా నీళ్లు సరిగా అందక పంట ఎండిపోయి దిగుబడి తక్కువగా వచ్చింది. దానికి తోడు తన వ్యవసాయ భూమి వద్ద 4 బోర్లు వేస్తే బోర్లు పడకపోవడం, గత సంవత్సరంలో అప్పు చేసి ఇల్లు కట్టుకోవడంతో బోర్లు వేయడానికి, ఇల్లు కోసం చేసిన అప్పుకు తోడు ఈ సీజన్ లో సాగు కోసం చేసిన అప్పు ఆ రైతు ఆత్మహత్యకు కారణాలయ్యాయి.

చేసిన అప్పులు కట్టలేని స్థితిలో అప్పుల బాధ భరించలేక నేడు తన వ్యవసాయ భావి వద్ద తుమ్మ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. అది గమనికంచిన స్థానికులు హుటా హుటిన జనగామ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అతను చనిపోయాడు. మృతుడికి భార్య (లక్ష్మి), ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు రాకేష్ (23), చిన్న కొడుకు అరవింద్ (20), కార్తీక్ (18) ఉన్నారు.పెద్ద కొడుకు రాకేష్ కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఆగస్టు నెలలో పెల్లి పెట్టుకుందాం అనుకునేలోపు ఈ ఆత్మహత్య సంఘటన ఆ రైతు కుటుంభం లో విషాదం నింపింది.

ఇది కూడా చదవండి:10ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసింది.!

Latest News

More Articles