Wednesday, May 8, 2024

10ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసింది.!

spot_img

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర మూడో రోజు మహబూబ్ నగర్ కు చేరుకుంది. మహబూబ్ నగర్ కు చేరుకున్న కేసీఆర్ అక్కడి ప్రజానీకం అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. సాయంత్రం నిర్వహించి రోడ్డులో గులాబీబాస్ ప్రసంగించారు. పార్లమెంటు ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీలో వున్నాయని… వీటిలో ఏ పార్టీ మనకు మేలు చేస్తదో ఆలోచన చేయాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు. 10ఏండ్లుగా అధికారంలో బీజేపీ తెలంగాణకు ఏం మేలు చేసిందని ఓటెయ్యాలని కేసీఆర్ ప్రశ్నించారు.

మోడీ వంద నినాదాలు చెప్పిండు ఒక్కటన్న నిజమైందా ? సబ్కా వికాస్ అన్నడు కానీ సత్యనాశ్ చేసిండు? అచ్చేదిన్ వచ్చిందా సచ్చేదిన్ వచ్చిందా .?నన్ను గెలిపిస్తే 15 లక్షలు మీ బ్యాంకుల వస్తాయన్నాడు వచ్చినయా.? నరేంద్ర మోడీ విశ్వగురువు ఎట్లాయే.? పాలమూరు ఎత్తి పోతలక్ కోసం వంద ఉత్తరాలు రాసినం జాతీయ హోదా ఇచ్చిండా..? లక్షలాది ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి నింపిండా అంటూ కేసీఆర్ ప్రసంగించారు. రైతులకు నల్ల చట్టాలు తెచ్చిండు వందలాది రైతుల మరణాలకు కారణమయ్యారని మండిపడ్డారు.

తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదన్న కేసీఆర్..ఈడ చోటే బాయి కి ఓటేసినా ఆడ బడే బాయికి ఓటేసినా ఒకటే అంటూ ఎద్దేవా చేశారు. ఏడు మండలాలను ఆంధ్రన్లోకలిపిన మోడీ కి ఎందుకెయాలే ఓటు అంటూ ప్రశ్నించారు. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టమని..ఆంధ్రాకు నీళ్లు మలుపుక పొమ్మని హారతులు పట్టిన డీకే అరుణకు ఓటెందుకెయ్యాలే అంటూ కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మాకు ఓటేస్తే నిమిషాల మీద యిదిస్తాం అదిస్తాం అన్నది కాంగ్రెస్ పార్టీ… ఐదునెళ్లు కావస్తాంది తెలంగాణ ప్రజలకు ఏం చేసింది. రైతు బందు వచ్చిందా? రుణ మాఫీ అయ్యిందా? పంటలకు బోనస్ వచ్చిందా?స్కూటీ ఇయ్యలేదు గానీ లూటీ అయితే నడుస్తాంది..తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిండ్రా .? ఆసరా పింఛను పెంచిండ్రా అంటూ కాంగ్రెస్ ను ఉతికారేస్తారు.

నాకండ్ల ముందట్నే తెలంగాణను ఆగం చేస్తానంటే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్రబోడన్నారు. బిఆర్ఎస్ సెక్యులర్ పార్టీ దీన్ని గెలిపించాలని ముస్లిం లాకుక్ విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. బీజేపీ గెలిస్తే ఎంతో నష్టం జరుగుతుందన్న కేసీఆర్ బీజేపీ కాంగ్రెస్ రొండు ఒకటే అన్నారు.బిఆర్ఎస్ కు మీరిచ్చే శక్తి మీ శక్తే..బిఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి ని గెలిపించాలని పాలమూరు ప్రజలకు విజ్నప్తి చేశారు కేసీఆర్.

ఇది కూడా చదవండి: జడ్చర్లలో బీఆర్ఎస్ అధినేతకు ఘనస్వాగతం..హారతిపట్టి స్వాగతించిన మహిళలు.!

Latest News

More Articles