Wednesday, May 22, 2024

రేపటి నుంచి వారి రేషన్ కార్డులు రద్దు?పూర్తి వివరాలివే.!

spot_img

మీరు దేశంలోని రేషన్ వినియోగదారులలో ఒకరయితే …ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవల్సిందే. ప్రభుత్వం నుంచి రేషన్ కార్డుపై బిగ్ అప్ డేట్ వస్తోంది. భారత ప్రభుత్వం వచ్చేనెల నుంచి మిలియన్ల కొద్దీ రేషన్ కార్దులను రద్దు చేసే అవకాశం ఉంది. 6నెలలు లేదా అంతకంటే ఎక్కువకాలం పాటు రేషన్ ద్వారా ఆహార ధాన్యాలు సేకరించని వారి రేషన్ కార్డును రద్దు చేసే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలను రిలీజ్ చేయనుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ మార్గదర్శకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకోంటుంది. అర్హులైన వారికి కూడా రేషన్ సరుకులు అందేవిధంగా క్రుషి చేస్తున్నారు.

రేషన్ లో చాలా మంది అనర్హులు లబ్ది పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద, పేద ప్రజలకు రేషన్ కార్డు ద్వారా ఆహార పదార్థాల పంపినీ కోవిడ్ కాలం నుంచి ప్రారంభమైంది. అయితే ఆర్థిక స్థోమత ఉన్న వారు చాలా మంది ఈ పథకం కింది ప్రయోజనం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అనర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అందుకని ఈ అనర్హులు అతి త్వరలో పథకం నుంచి వైదొలిగే ఛాన్స్ ఉంది.

అనర్హులకు ఫ్రీగా గోధుమలు, బియ్యం, ఇతర ధాన్యాలు ఇవ్వడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా ఉన్నాయి.ఈ పరిస్థితిని పరిష్కరించడానికి కేంద్రం ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజా పంపిణీ కేంద్రాల కోసం కొత్త విధానాలతో వస్తోంది. అలాంటి ఫిర్యాదు వస్తే డీలర్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. మీడియా రిపోర్ట్స్ ప్రకారంఅనర్హులపై కఠిన చర్యలు తీసుకోనుంది. అంటే వారి రేషన్ కార్డులను రద్దు చేయనుంది.

ఇది కూడా చదవండి: అక్షయ తృతీయకు బంగారం, వెండి కొనలేకపోతే వీటిని కొనండి.!

Latest News

More Articles