Friday, May 17, 2024

వాట్సాప్ లో అమ్మాయిలను వేధిస్తున్న పోకిరికి దేహశుద్ది!

spot_img

హైదరాబాద్: వాట్సప్ లో అమ్మాయిలను వేధిస్తున్న పోకిరికి దేహశుద్ది చేశారు స్థానికులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాని ఆలియాస్ సికిందర్(26) అనే యువకుడు బీఎస్సీ చదివాడు. ఓ డయోగ్నోస్టిక్ సెంటర్ లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గంజాయికి బానిసై మహిళలను టార్గెట్ చేసుకొని ఫోన్ లో అశ్లీల మెసేజ్ లతో వేధింపులకు పాల్పడుతున్నాడు.

పనిచేసే చోటు నుంచి తీసుకున్నమహిళల ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తూ వేధించేవాడు. వేధింపులు తీవ్రం కావడంతో మహిళలు, వారి బంధువులు సికిందర్ ను పట్టుకొని చితకబాదారు. సమాచారం అందుకున్న సూరారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడ్డ  పోకిరిని స్టేషన్ కు తరలించారు. విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Latest News

More Articles