Saturday, May 4, 2024

వరల్డ్ కప్: అఫ్ఘాన్‎తో భారత్ ఢీ.. బ్యాటింగ్ పిచ్ కావడంతో భారీ స్కోరే లక్ష్యం

spot_img

వన్‌ డే ప్రపంచకప్‌ టోర్నీని విజయంతో ఆరంభించిన టీమ్‌ఇండియా.. తర్వాతి పోరుకు సిద్ధమైంది. అందులో భాగంగా బుధవారం అఫ్ఘానిస్థాన్‌‎తో పోటీపడనుంది. ఈ రెండు జట్ల మధ్య నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలోని అరుణ్‌ జైట్టీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. భారత్‌ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి మాంచి ఊపు మీదుండగా.. తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో పరాజయం పాలైన అఫ్ఘాన్‌ టీమిండియాపై ఎలాగైనా నెగ్గాలని ఉవ్విళ్లూరుతోంది.

కాగా.. ఈ ప్రపంచకప్‌ టోర్నీలో ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి. ఇవాళ జరిగేది 9వ మ్యాచ్‌. ఆడిన రెండేసి మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ జట్లు నాలుగేసి పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలను ఆక్రమించాయి. భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు ఒక్కో మ్యాచ్‌ గెలిచి రెండేసి పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌ టీమ్‌లు ఒక్కో విజయం, ఒక్కో ఓటమితో రెండేసి పాయింట్లు సాధించి ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్‌ ఆడిన ఒక్కో మ్యాచ్‌ ఓడిపోగా.. బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లు రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఓడిపోయి ఇంకా ఖాతా తెరువలేదు.

Read Also: ఎన్నికల యుద్ధం మొదలుపెట్టిన కేసీఆర్.. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటన

కాగా.. అరుణ్‌ జైట్లీ స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలం కాబట్టి మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఇక్కడ ఓ మ్యాచ్‌ జరగ్గా.. అందులో దక్షిణాఫ్రికా ఏకంగా 428 పరుగులతో రికార్డు నెలకొల్పింది. తర్వాత శ్రీలంక కూడా 300 పైచిలుకు స్కోరు చేసింది. కాబట్టి టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేస్తే భారత్‌ నుంచి కూడా భారీ స్కోరు ఆశించవచ్చు.

Latest News

More Articles