Friday, May 17, 2024

UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాస్తున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..!!

spot_img

UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష రేపటి నుండి ప్రారంభమవుతుంది. ఈ పరీక్ష సెప్టెంబర్ 15, 2023 నుండి సెప్టెంబర్ 24, 2023 వరకు జరగనుంది. పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. దీని ప్రకారం మొదటి షిప్టు పేపర్‌ను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్ట్‌ పేపర్‌ను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించనున్న ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన నియమాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇవి పరీక్ష సమయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైనవి. నిబంధనలను విస్మరిస్తే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ 8 గణపతి మంత్రాలను పఠిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవట..!

గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

-UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ కోసం జారీ చేసిన అడ్మిట్ కార్డ్‌లో ప్రవేశ సమయంగా ఉంది. దీని ప్రకారం అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.

-అడ్మిట్ కార్డ్‌తో పాటు, మీరు ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID కార్డ్ లేదా పాస్‌పోర్ట్ వంటి చెల్లుబాటు అయ్యే ఫోటో IDని తీసుకెళ్లవచ్చు.

– పరీక్ష సమయంలో అభ్యర్థులు స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్, బ్లూటూత్ డివైజ్‌తో సహా ఇతర పరికరాలను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడం నిషేధం. ఈ పరికరాలతో కేంద్రంలో ఎవరైనా పట్టుబడితే వెంటనే పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపిస్తారు.

– అడ్మిట్ కార్డ్‌లో, ఇ-అడ్మిట్ కార్డ్‌లో స్పష్టమైన ఫోటోగ్రాఫ్‌లు లేని అభ్యర్థులు ప్రతి సెషన్‌కు ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ను అండర్‌టేకింగ్‌తో పాటు పరీక్షకు హాజరుకావాలి.

ఇది కూడా చదవండి: మారుతీ సుజుకి కార్లపై బంపర్ ఆఫర్లు…ఏకంగా రూ. 65వేల వరకు డిస్కౌంట్..!!

Latest News

More Articles