Friday, May 3, 2024

చైనాలో ఘోర ప్రమాదం.. క్రేన్ పడి ఆరుగురు కార్మికులు మృతి

spot_img

చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైరుతి చైనాలో వంతెన నిర్మాణ సమయంలో క్రేన్ పడి 6గురు కార్మికులు మరణించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. మరో ఐదుగురు గాయపడినట్లు పేర్కొంది. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. నగరంలోని టువో నదిపై ఎక్స్‌ప్రెస్‌వే వంతెన నిర్మాణంలో బుధవారం ఈ ప్రమాదం సంభవించిందని జియాన్‌యాంగ్ నగర రవాణా బ్యూరో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపింది. కాగా జియాన్యాంగ్ నగరం సిచువాన్ ప్రావిన్స్‌లో ఉంది.

ఇది కూడా చదవండి: ఆధార్ కార్డ్ పోయిందా? డోంట్ వర్రీ..ఇంట్లో కూర్చొని ఇలా అప్లయ్ చేసుకోండి..!!

జులైలో కూడా చైనాలో ఓ భవనం టైల్స్ పడిపోవడంతో నలుగురు కార్మీకులు తీవ్రంగా గాయపడ్డారు.  చైనీస్ నిర్మాణ నాణ్యత సరిగా లేకపోవడంతో..హునాన్ ప్రావిన్స్‌లోని జిన్‌హువాలో ఎత్తైన భవనం పలకలు అకస్మాత్తుగా విరిగి కిందపడ్డాయి. దీంతో భవనం కింద నిల్చున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన సమయంలో భవనం కింద ఎక్కువ మంది లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. జనం ఉంటే ప్రమాదస్థాయి భారీగా ఉండేది. ఇటువంటి సంఘటనలు చైనా యొక్క పేలవమైన తయారీని బహిర్గతం చేశాయి.

ఇది కూడా చదవండి: UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాస్తున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..!!

అటు చైనాలో నిర్మాణ సమయంలో అనేక క్రేన్ ప్రమాదాలు జరుగుతుండగా, ఇటీవలి కాలంలో ప్రకృతి కూడా చైనా పగబట్టింది. గత నెలలో చైనాలోని జియాన్ ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 21 మంది మరణించగా, 6 మంది తప్పిపోయారు. కొండచరియలు విరిగిపడటం. వరదల కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. హైవేలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దేశంలోని అనేక నగరాల్లోని లోతట్టు ప్రాంతాలలో వరదల కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. మీడియా నివేదికల ప్రకారం, రెండు నెలల క్రితం జులైలో, చైనాలో వరదలు,  కొండచరియలు విరిగిపడిన సంఘటనల కారణంగా 142 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.

Latest News

More Articles