Friday, May 3, 2024

తెలంగాణకు ఎల్లో అలెర్ట్..5 రోజులపాటు వర్షాలు..!

spot_img

హైదరాబాద్: తెలంగాణలో రాబోయే 5 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదే సమయంలో గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని..ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలతో అల్లాడిన భాగ్యనగరం మధ్యాహ్నం కురిసిన వర్షాలతో అకస్మాత్తుగా చల్లబడింది. ఫిలింనగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

Latest News

More Articles