Saturday, May 18, 2024

ఏఐ గ‌ర్ల్‌ఫ్రెండ్స్‌ను కోరుకుంటున్న యువ‌త!

spot_img

న్యూయార్క్ : వ‌ర్చువ‌ల్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ గ‌ర్ల్‌ఫ్రెండ్స్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నది. అమెరికాలో ఈ ట్రెండ్ పెరుగుతుండ‌టం పట్ల నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఒర‌వ‌డి యువ‌త‌లో ఒంట‌రితనాన్ని మ‌రింత పెంచుతున్న‌ద‌ని హెచ్చరిస్తున్నారు.

Also Read.. మూడేళ్ళ బాలుడి హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

ఏఐ గ‌ర్ల్‌ఫ్రెండ్స్ అందుబాటులోకి రావ‌డంతో పురుషుల ఒంట‌రిత‌నాన్ని మ‌రింత దిగ‌జార్చుతున్న‌ద‌ని ఒలిన్ బిజినెస్ స్కూల్ ప్రాక్టీస్ ఆఫ్ డేటా సైన్స్ ప్రొఫెస‌ర్ లిబ‌ర్టీ విటెర్ట్ తాజాగా హెచ్చ‌రించారు. ఏఐ గ‌ర్ల్‌ఫ్రెండ్స్ ఉన్న‌ప్ప‌టికీ వాటిగురించి బాహాటంగా వెల్ల‌డించేంత‌గా ప్ర‌ధాన స్ర‌వంతిలోకి వ‌చ్చాయ‌ని చెప్పారు.

Also Read.. మళ్లీ అలాంటి యాడ్స్ లో నటించలేదు

వ‌ర్చువ‌ల్ గ‌ర్ల్‌ఫ్రెండ్స్ తో ముచ్చ‌టిస్తూ, ప్రేమిస్తూ, పర్ఫెక్ట్ రిలేష‌న్‌షిప్‌ను క్రియేట్ చేసే ప‌లు యాప్స్ అందుబాటులోకి రావడంతో ఇటీవల క్రేజీ పెరిగిందని ప్ర‌ముఖ యాప్ రెప్లికా తెలిపింది. ఈ ప‌రిణామం పురుషుల్లో సింగిల్స్‌ను పెంచేస్తుంద‌ని, అమెరికాలో బ‌ర్త్ రేట్స్‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Latest News

More Articles