Wednesday, May 22, 2024

రూ. 16 లక్షల బైక్ పై ఫుడ్ డెలివరీ.. వైరలవుతున్న వీడియో

spot_img

చాలామంది సంపాదన కోసం డెలివరీ బాయ్‎గా పనిచేస్తుంటారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి డెలివరీ బాయ్ అవతారమెత్తి.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఎందుకంటే అతను డెలివరీ చేస్తున్న బైకు మహత్యం అది. హెచ్‌ఎస్‌బీ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కనిపించిన వీడియోలో ఒక వ్యక్తి ఖరీదైన ‘సుజుకి హయబుసా’ బైక్ రైడ్ చేస్తున్నాడు. ఇందులో రైడర్ జొమాటో డెలివరీ బాయ్ వేషధారణలో ఉండటం గమనించవచ్చు. వీడియోలో కనిపించే ఖరీదైన సూపర్ బైక్ ధర రూ. 13 లక్షల నుంచి రూ. 17 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది.

Read also: సెంచరీ మిస్ అయినా శ్రీలంక మ్యాచులో కోహ్లి రికార్డ్

అయితే సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఖరీదైన బైకుల ద్వారా జొమాటో ఫుడ్ డెలివరీ చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇది ఆ కోవకు చెందినదేనా అని అనుకుంటున్నారు.

Latest News

More Articles