Saturday, May 11, 2024

సెంచరీ మిస్ అయినా శ్రీలంక మ్యాచులో కోహ్లి రికార్డ్

spot_img

ముంబాయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియా-శ్రీలంక మ్యాచులో విరాట్ కోహ్లి రెచ్చిపోయాడు. ఓపెనర్‎గా దిగిన కోహ్లి.. 94 బంతుల్లో 88 పరుగులు చేసి అవుటయ్యాడు. మధశంక బౌలింగ్‎లో నిస్సంకాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా.. ఈ మ్యాచ్ లో కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేలకు సంబంధించి ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా విరాట్‌ రికార్డులకెక్కాడు. శ్రీలంకపై 34 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కోహ్లి ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లి ఇప్పటివరకు 8 సార్లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కుపైగా పరుగులు సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది. సచిన్‌ తన వన్డే కెరీర్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 7 సార్లు 1000కు పైగా పరుగులు నమోదు చేశాడు. తాజా రికార్డుతో సచిన్ రికార్డును కోహ్లి బ్రేక్‌ చేశాడు. అంతేకాకుండా.. కోహ్లి ఈ మ్యాచ్‎లో సెంచరీ చేసి ఉంటే.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌(49) రికార్డును సమం చేసేవాడు.

Read Also: కేరళ సీఎంను చంపేస్తానంటూ 12 ఏండ్ల బాలుడి వార్నింగ్

Latest News

More Articles