Wednesday, June 26, 2024

రాష్ట్రంలో మరో 100 ఆరోగ్య మహిళా కేంద్రాలు

spot_img

మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మహిళల్లో ఉన్న పోషకాహార లోప నివారణ కోసం ఈ కేంద్రాలలో అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందిస్తున్నారు. ఈ క్లినిక్‎లకు వచ్చే మహిళల వివరాలను ప్రత్యేక రూపొందించిన యాప్‎లో నమోదు చేస్తున్నారు.

ఈ ఏడాది మార్చి 8న‌ ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలుత 24 జిల్లాల్లో 100 ఆరోగ్య మహిళ క్లినిక్స్ ప్రారంభించగా, జూన్ 14 నుంచి మిగతా 9 జిల్లాల్లోని 172 కేంద్రాల్లో సేవలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 272 ఆరోగ్య మహిళ క్లినిక్స్ ఇప్పటివరకు సేవలందిస్తున్నాయి.

Read Also: ఓటీటీలోకి వ‌చ్చేసిన రజనీకాంత్ ‘జైలర్‌’

కాగా.. మహిళలకు ఈ సేవలు మరింత సౌకర్యంగా ఉండటం కోసం మరో 100 కేంద్రాలలో ఈ క్లినిక్‎లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 12న వీటన్నింటిని ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ 100 క్లినిక్‎ల ప్రారంభంతో ఆరోగ్య మహిళ క్లినిక్స్ రాష్ట్రవ్యాప్తంగా 372కు చేరుకోనున్నాయి. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ క్లినిక్స్ లో పూర్తిగా మహిళా వైద్యులు,మహిళాసిబ్బంది ఉండి సేవలు అందిస్తారు. 8 రకాల వైద్య పరీక్షలను అందించడం జరుగుతున్నది.

Latest News

More Articles