Sunday, May 19, 2024

 13 ఏండ్ల బాలుడి డిమాండ్: పెళ్లి చేస్తేనే చదువుకుంటా

spot_img

మంచిగ చదువుకుంటే ఏదైనా గిఫ్ట్ కొనిస్తామని తల్లిదండ్రులు చెబుతుంటారు. లేదంటే ఈ సారి క్లాస్ ఫస్ట్ వస్తే తానకు నచ్చినే వస్తువు కావాలని పిల్లలు అడుగుతారు. ఇది కామన్ గా జరిగేది. అయితే వీటన్నింటికి భిన్నంగా తన తల్లిదండ్రులను ఎవరూ ఊహించని డిమాండ్ చేశాడు ఓ బాలుడు. అది కుదరదంటే చదువుకోనని తేల్చి చెప్పాడు.

పాకిస్తాన్ కు చెందిన 13 ఏళ్ల ఓ బాలుడు తనకు పెళ్లి చేయాలని లేదంటే చదుకుకోని స్పష్టం చేశాడు. ఆ విద్యార్ధి తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా విన్పించుకోలేదు. దీంతో ఏం చేయాలో తెలియక 12 ఏళ్ల బాలికతో పెద్దల సమక్షంలో గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ జరిపించారు. అంతేకాదు పెళ్లి కూడా ఘనంగా జరిపించాలని అనుకుంటున్నారట.దీనికి ఇరు కుటుంబాలు అంగీకరించడం విచిత్రం.ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. మరోవైపు బాల్యవివాహాన్ని ప్రోత్సహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి:హైదరాబాద్ సిటీ పార్కుల్లో షీ టీమ్స్ నిఘా

Latest News

More Articles