Friday, May 17, 2024

ఒకదానితో ఒకటి ఢీకొన్న వాహనాలు.. 17 మంది మృతి

spot_img

చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జియాంగ్జీ ప్రావిన్స్‌లోని నాన్‌చాంగ్‌ కౌంటీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో 17 మంది మరణించగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.

కాగా, భారీగా కురుస్తున్న మంచువల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అయితే కొన్ని గంటల వ్యవధిలో నాన్‌చాంగ్‌ ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రావిన్స్‌లో దట్టంగా పొగమంచు కమ్ముకున్నదని, వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో వాహనాలను ఓవర్‌టేక్‌ చేయడానికి ప్రయత్నించవద్దని, దూరం పాటించాలని చెప్పారు.

Latest News

More Articles