Sunday, May 19, 2024

రాష్ట్రంలో 11 గంటలకు పోలింగ్ 20.64 శాతం నమోదు

spot_img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల  పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 20.64 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు  ఎన్నికల అధికారులు ప్రకటించారు.

అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 30.65 శాతం పోలింగ్‌ నమోదుకాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 12.39 శాతం పోలింగ్‌ నమోదైంది. వీటితో పాటు..భద్రాద్రిలో 22 శాతం,హనుమకొండలో 21.43 శాతం,జగిత్యాలలో 22.5 శాతం,జనగాం 23.25 శాతం,భూపాలపల్లిలో 27.80 శాతం,గద్వాల్‌లో 29.54 శాతం,కామారెడ్డిలో 24.70 శాతం,కరీంనగర్‌లో 20.09 శాతం, ఖమ్మంలో 26.03 శాతం,ఆసిఫాబాద్‌లో 23.68 శాతం,మహబూబాబాద్‌లో 28.05 శాతం,మహబూబ్‌ నగర్‌లో 23.10 శాతం, మంచిర్యాలలో 24.38 శాతం,మెదక్‌లో 30.27 శాతం,మేడ్చల్‌లో 14.74 శాతం,ములుగులో 25.36 శాతం,నాగర్‌ కర్నూల్‌లో 22.19 శాతం,నల్గొండలో 22.74 శాతం,నారాయణపేటలో 23.11 శాతం,నిర్మల్‌లో 25.10 శాతం,నిజామాబాద్‌లో 21.25 శాతం,పెద్దపల్లిలో 26.41 శాతం,సిరిసిల్లలో 22.02 శాతం,రంగారెడ్డిలో 16.84 శాతం,సంగారెడ్డిలో 21.99 శాతం,సిద్దిపేటలో 28.08 శాతం, సూర్యాపేటలో 22.58 శాతం,వికారాబాద్‌లో 23.16 శాతం,వనపర్తిలో 24.10 శాతం,వరంగల్‌లో 18.73 శాతం,యాదద్రిలో 24.29 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఓటు వేసిన ఎంపీ సంతోష్ కుమార్

Latest News

More Articles