Friday, May 3, 2024

సీతక్కకు పని తక్కువ.. ప్రచారం ఎక్కువ.. మంత్రి హరీష్ రావు చురకలు

spot_img

హైదరాబాద్: ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో మాత్రమే ఉంటారని మంత్రి హరీష్ రావు అన్నారు. సీతక్కకు పని తక్కువ ప్రచారం ఎక్కువ అని చురకలు అంటించారు. తెలంగాణ వచ్చాక ములుగు జిల్లా బాగా అభివృద్ధి జరిగింది. ములుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న ములుగును జిల్లా చేశారు. సమ్మక్క, సారక్క జాతరను పెద్ద యెత్తున నిర్వహిస్తున్నారు కేసిఆర్ అని చెప్పారు. తెలంగాణ భవన్ లో మంత్రులు హరీష్ రావు , సత్యవతి రాథోడ్ సమక్షంలో ములుగు జిల్లా నుండి 200 మంది వరకు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Also Read.. పటాన్‌చెరు పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు

ఐటీసీ ఫ్యాక్టరీ ప్రారంభానికి రెడీగా ఉందన్నారు. ములుగు అభ్యర్థిగా నాగజ్యోతిని గెలిపించాలని కోరారు. ఎవరెన్ని చెప్పినా నమ్మవద్దని, రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నేతలు 5 గంటల కరెంట్ ప్రచారంతో అబాసుపాలైంది. ఉచిత కరెంట్ ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? వ్యవసాయానికి ఎంత హెచ్పీ మోటార్ వాడుతారో కూడా తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.

Also Read.. మరో రికార్డ్ మీద కన్నేసిన కోహ్లీ.. నేటి మ్యాచ్‎లో ఏం చేస్తాడో చూడాలి మరి

కర్ణాటక లో రెండు గంటల కరెంట్ కూడా రావటం లేదని అక్కడి మాజీ సీఎం కుమార స్వామి చెప్తున్నాడు. ఇలాంటి కాంగ్రెస్ మనకు అవసరమా? కేసిఆర్ హయాంలో పల్లెల్లో కరువు లేదు. హైదారాబాద్ లో కర్ఫ్యూ లేదు. కర్ణాటకలో రైతు బంధు ఇవ్వని కాంగ్రెస్ ఇక్కడ 15 వేలు ఎలా ఇస్తారు? కేసిఆర్ గెలిస్తే 16వేలు రైతు బంధు ఇవ్వటం ఖాయం. ధాన్యం కొనమంటే కేవలం 13 క్వింటాళ్ల కొంటామని చెప్తున్నారు. మరి మిగిలిన ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలని నిలదీశారు.

Also Read.. వచ్చేది మా ప్రభుత్వమే.. ఇంతకు ఇంత అనుభవిస్తారు

వంద అబద్ధాలు ఆడి సీఎం కుర్చీ దక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. 11 సార్లు అవకాశం ఇచ్చిన కనీసం బిందె నీళ్ళు ఇవ్వలేదు కాంగ్రెస్. కేసిఆర్ను భూతులు తిడుతున్నారు.. మాకు తిట్టడం చేతకాక కాదు. తిడితే రేపటి వరకు తిడుతాం. మాకు సంస్కారం ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తోంది. బిజెపి ఇన్నేళ్లు అధికారంలో ఉంది ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

Latest News

More Articles