Sunday, May 19, 2024

బంజారాహిల్స్‌ లో రూ.3.35 కోట్ల నగదును స్వాధీనం

spot_img

తెలంగాణలో ఎన్నికల కోడ్‌లో అమలులోకి రావడంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భారీగా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.3కోట్లకుపైగా నగదును సీజ్‌ చేశారు. ఎన్నికల కోడ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెస్ట్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. తనిఖీలో రూ.3.35కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టుకున్న నగదును హవాలా డబ్బుగా గుర్తించినట్లు తెలిపారు. డబ్బును తరలిస్తున్న నలుగురు.. చింపి రెడ్డి హనుమంత రెడ్డి, బచ్చల ప్రభాకర్, మండల శ్రీరాములు రెడ్డి, మందల ఉదయ్ కుమార్ రెడ్డి లను  అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

ఆ నలుగురు ఏపీకి చెందిన వ్యక్తులని.. రూ.కోటికి రూ.25వేల కమిషన్‌ తీసుకుంటున్నారని డీసీపీ వివరించారు.నగదు తరలిస్తున్న కియా వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ ప్రకారం రూ.50 వేలకు పైగా డబ్బులను తీసుకువెళ్లే తప్పనిసరిగా నగదుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: దేశ వ్యాప్తంగా బీసీ లకు న్యాయం చేయడమే బీఆర్ఎస్ లక్ష్యం

Latest News

More Articles