Wednesday, May 8, 2024

దేశ వ్యాప్తంగా బీసీ లకు న్యాయం చేయడమే బీఆర్ఎస్ లక్ష్యం

spot_img

దేశ వ్యాప్తంగా బీసీలకు న్యాయం జరిపించటమే బీఅర్ఎస్ లక్ష్యమన్నారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పాలనలో బీసీ లను ఎందుకు పట్టించు కాలేదో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. నాయి బ్రాహ్మణులు అంటే విట్టలేశ్వరునికే క్షవరం చేసిన చరిత్ర.అశ్విని దేవతల వారసులు నాయి బ్రాహ్మణులు అని అన్నారు. నాయి బ్రాహ్మణులు లేకుంటే సమాజానికి ఎంత ఇబ్బంది ఉంటుందో సీఎం కేసీఆర్ ఎన్నో సార్లు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారన్నారు.

నాయి బ్రాహ్మణుల కుల వృత్తిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల సెలూన్ లకు సబ్సిడీ విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ.. మరో వైపు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. 12 లక్షల కళ్యాణ లక్ష్మి లబ్ధి దారుల్లో  7 లక్షలు బీసీ లబ్ధిదారులు ఉన్నారన్నారు. గతంలో పని చేసిన  ప్రభుత్వాలు బీసీలకు ,కులవృతులను నిర్లక్ష్యం చేశాయన్నారు.

బీసీ లకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీ లో మొట్ట మొదట తీర్మానం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. 60 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హాయం లో బీసీ గణన ఎందుకు జరగలేదో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. దేశంలో ఉన్న బీసీ లకు న్యాయం జరగాలన్నారు. రెండు సార్లు ఆశీర్వదించి గెలిపించారు .మళ్లీ బీ అర్ ఎస్ పార్టీని భారీ మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ కవిత.

ఇది కూడా చదవండి:టీఎస్ఆర్టీసీ దసరా ధమాకా: బస్సెక్కితే బహుమతులు

Latest News

More Articles