Sunday, May 12, 2024

1988 నుంచి 42 మంది ఎంపీలపై వేటు..!

spot_img

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ పీపీ, బీఎస్పీ నేత అఫ్జల్ అన్సారీలు లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన క్రమంలో ప్రజాప్రాతినిథ్య చట్టం1951పై మరోసారి చర్చ మొదలైంది. కాగా, 1988 నుంచి ఇప్పటి వరకు ఈ చట్టం కింద 42 మంది ఎంపీలు అనర్హులైనట్లు పార్లమెంట్ రికార్డులు చెబుతున్నాయి. 14వ లోక్‌సభలో అత్యధికంగా 19 మంది ఎంపీలపై అనర్హతకు గురయ్యారు.

తొలిసారిగా 1985లో లాల్దుహోమా అనే కాంగ్రెస్ సభ్యుడిపై అనర్హత వేటు పడింది. ఇప్పటి వరకు ఈ చట్టం కింద అనర్హత పడ్డ వారిలో ముఫ్తీ మహ్మద్ సయీద్ (1989), సత్య పాల్ మాలిక్ (1989), శిబు సోరెన్(2001), జయా బచ్చన్ (2006), శరద్ యాదవ్ (2017), అలీ అన్వర్ (2017)లు ఉన్నారు.

అయితే, ఎంపీల అనర్హత విషయంలో ప్రస్తుతం రెండు చట్టాలు అమల్లో ఉన్నాయి. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద పార్టీ జారీ చేసిన విప్ ను ధిక్కరించిన సమయంలో ఎంపీలపై అనర్హత వేటు వేయవచ్చు. అలాగే  రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కోర్టు శిక్ష విధించిన కేసుల్లో ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం పార్లమెంట్‌ సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దవుతుంది.

Latest News

More Articles