Friday, May 3, 2024

మరోసారి పంజా విసురుతోన్న కోవిడ్..ఒక్కరోజే ఏడుగురికి పాజిటివ్.!

spot_img

దేశంలో కోవిడ్ మరోసారి పంజా విసురుతోంది.తాజాగా ఘజియాబాద్ లో ఏడుగురికి కరోనా పాజిటివ్ గా గుర్తించారు. ఒకే రోజు 7 మందికి కరోనా నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖలో కలకలం రేగింది.రాజ్‌నగర్, వసుంధర, వైశాలి, సాహిబాబాద్‌లలో ఈ కరోనా కేసులను గుర్తించారు. ప్రస్తుతం, ఘజియాబాద్‌లో మొత్తం 9 మంది రోగులు కరోనా పాజిటివ్‌గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కరోనా సోకిన రోగులలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు వ్యాధి బారిన పడినట్లు అధికారులు తెలిపారు.

రాజ్‌నగర్‌లో నివసిస్తున్న 53 ఏళ్ల వ్యక్తి అతని కుమారుడు జలుబు, దగ్గుతో బాధపడుతుంటే కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలినట్లు చెప్పారు. విచారణలో ఇద్దరికీ వ్యాధి సోకినట్లు తేలింది. వైశాలిలో నివసిస్తున్న 23 ఏళ్ల యువకుడు కూడా గొంతు నొప్పి, జలుబు, జ్వరం కారణంగా కోవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. సాహిబాబాద్‌లో నివసిస్తున్న 65 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా ఇన్‌ఫెక్షన్ నిర్దారణ అయినట్లు వైద్యులు తెలిపారు.

2020 నుండి గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడగా, 5.3 లక్షల మందికి పైగా మరణించడం గమనార్హం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ఇప్పటివరకు ఇన్‌ఫెక్షన్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. ఈ ఇన్‌ఫెక్షన్ నుండి జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. దేశంలో కోవిడ్-19 వ్యతిరేక టీకా ప్రచారం కింద ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్‌లు అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: నేడు గురుకుల జేఎల్, డీఎల్ ఫలితాలు వెల్లడి..!!

Latest News

More Articles