Saturday, May 18, 2024

16 మంది అబ్యాయిలపై లైంగిక వేధింపులు.. నిందితుడికి 707 ఏళ్ల జైలుశిక్ష

spot_img

కాలిఫోర్నియా: చిన్నారుల సంరక్షణ చూడాల్సిన ఓ వ్యక్తి.. దాదాపు 16 మంది అబ్బాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు అతడికి 707 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందిన మాథ్యూ జాక్‌జేవ్‌స్కీ (34) స్థానికంగా చిన్నారుల సంరక్షణ బాధ్యతలు చూస్తుంటాడు.

ఈ క్రమంలో తమ కుమారుడితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు ఓ కుటుంబం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లైంగిక వేధింపుల విషయం బయటపడింది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో 2 – 14 ఏళ్ల దాదాపు 16 మంది బాలురపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు.

Latest News

More Articles