Sunday, May 5, 2024

తడబడ్డ నిలబడ్డరు..కేఎల్ రాహుల్, విరాట్ హాఫ్‌ సెంచరీలు.. ఆసీస్‌ టార్గెట్ ఎంతంటే?

spot_img

వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్‌లలో 240 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఆస్ట్రేలియాకు భారత్ 241 పరుగులను లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియాలో కేఎల్ రాహుల్ (66), విరాట్ కోహ్లీ (54) హాఫ్ సెంచరీలు కొట్టగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (47) రాణించారు. ఆసీస్‌ బౌలర్లు మిచెల్ స్టార్క్‌ మూడు , ప్యాట్ కమిన్స్, జోష్‌ హేజిల్‌వుడ్ రెండు, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, జంపా చెరో వికెట్‌ తీశారు.

ఇన్నింగ్స్ ప్రారంభంలో శుభ్‌మన్‌ గిల్ (4) త్వరగానే ఔటైనప్పటికీ మరో ఎండ్‌లోని కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. దీంతో 9 ఓవర్లకే 70 పరుగులు దాటేసింది. దీంతో స్టేడియం అంతా జోష్‌తో నిండిపోయింది. స్వల్ప వ్యవధిలో రోహిత్‌తో పాటు శ్రేయస్‌ను (4) ఔట్ చేశారు. దీంతో పరుగుల వేగం మందగించింది. విరాట్ – కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 109 బంతుల్లో 67 పరుగులు జోడించారు. విరాట్ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన తర్వాత కమిన్స్‌ బౌలింగ్ లో బౌల్డ్‌ అయ్యాడు.

అనంతరం రవీంద్ర జడేజా (9) అలా వచ్చి ఇలా వెళ్లాడు. మరోవైపు క్రీజ్‌లో పాతుకు పోయిన కేఎల్‌ను స్టార్క్‌ బోల్తా కొట్టించాడు. షమీ (6) కూడా బ్యాట్‌ను ఝుళిపించే ప్రయత్నంలో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బూమ్రా 1 పరుగులకే ఔట్‌ అవ్వగా.. చివరిలో స్పీడుగా ఆడే క్రమంలో సూర్యకుమార్‌ యాదవ్‌ (18) ఔటయ్యాడు. చివరిలో కుల్‌ దీప్‌ యాదవ్‌ 10(18) పరుగులు చేసి రనౌట్‌ అవ్వగా.. మహ్మద్‌ సిరాజ్‌ 9(8) నాటౌట్‌గా నిలిచాడు. భారత ఇన్నింగ్స్‌లో కేవలం 13 ఫోర్లు, మూడు సిక్స్‌లు మాత్రమే ఉండటం గమనార్హం.

Latest News

More Articles