Saturday, May 18, 2024

ఇందిరమ్మ రాజ్యంలోనే హైదరాబాద్‌లో మతకల్లోలాలు జరిగినయ్

spot_img

మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తమని కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్నరు.. ఇందిరమ్మ రాజ్యంలోనే రక్తపాతమైంది. మతకల్లోలాలు హైదరాబాద్‌లో జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు సీఎం.. మర్రి జనార్దన్‌రెడ్డిని భారీ మెజారిటీతో ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పాలనలో మొత్తం కరువు, కాటకాలే

కేసీఆర్‌ ప్రజలు కట్టిన డబ్బులతో రైతుబంధు ఇచ్చి వేస్ట్‌ చేస్తున్నడని మాట్లాడుతున్నారు. రైతుబంధు ఉండాలంటే నాగర్‌ కర్నూల్‌లో మర్రి జనార్దన్‌రెడ్డిని గెలిపించాలి. ఇక్కడ ఏ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి గెలిస్తే బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ వస్తుంది. వేరేవాళ్లు గెలిస్తే కాంగ్రెస్‌ పార్టీ వస్తుంది. కాబట్టి ప్రజలు దీర్ఘంగా ఆలోచన చేయాలన్నారు. రైతుబంధు, రైతుబీమా, వడ్లు అమ్మిన డబ్బులు ఎట్ల వస్తున్నయ్‌. హైదరాబాద్‌లో డబ్బులు వేస్తే బ్యాంకుల్లో మీ డబ్బులు ఉంటున్నయ్‌. ధరణిని తీసివేస్తే ఈ డబ్బులు ఎలా వస్తయ్‌ ? అని అడిగారు సీఎం కేసీఆర్.

మళ్లీ ఎమ్మార్వో ఆఫీసులు.. అగ్రికల్చర్‌ ఆఫీసుల చుట్టూ తిరిగాలన్నారు కేసీఆర్. అంతేకాదు.. రైతుబంధు ఎంత వస్తుంది రూ.60వేలు వస్తుందంటే.. రూ.20వేలు ఇవ్వు.. లేకపోతే సంతకం పెట్ట అంటడు అని అన్నారు. కాంగ్రెస్‌ రాజ్యంలో ఆపద్భాందు పెట్టారు. రూ.50 వేలు ఒక్కరికీ ఇవ్వలేదు. చెప్పులరిగేలా తిరిగితే ఆరు ఏడు నెలలు రూ.10వేలు చేతులపెట్టేదన్నారు. మళ్లీ అదే రాజ్యం రావాల్నా? మళ్లీ తాకట్లు పెట్టి.. కేసులు, ఆఫీసుల చుట్టూ తిప్పి.. రైతుల దగ్గర లంచాలు గుంజి మళ్లీ దళారీ రాజ్యమే రావాల్నా’? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్‌.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌, బీజేపీని నమ్మితే మోసపోతం

Latest News

More Articles