Sunday, May 19, 2024

కర్ణాటక సీఎం సహా మంత్రులంతా నేర చరితులే..!

spot_img

న్యూఢిల్లీ: కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ నేర చరిత్ర కలిగిన వారే. ఈ మేరకు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌( ఏడీఆర్‌) నివేదిక తెలిపింది. సీఎం సిద్ధరామయ్య కేబినెట్ లోని నలుగురు మంత్రులపై సీరియస్ క్రిమినల్‌ కేసులున్నాయి.

ఏడీఆర్ విడుదల చేసిన కోటీశ్వరుల జాబితాలో తొమ్మిది మంది మంత్రులు ఉన్నారు. అత్యధికంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ రూ.1413.80 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. అత్యల్పంగా మంత్రి ప్రియాంక్‌ ఖర్గే రూ.16.83 కోట్లతో ఉన్నారు.

కర్ణాటక కేబినెట్-కేసులు:

  1. సీఎం సిద్ధరామయ్య- కేసులు 13 (సీరియస్‌-6)
  2. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ -కేసులు 19 (సీరియస్‌ -6)
  3. లక్ష్మణ్‌రావు -2 కేసులు
  4. ఎంబీ పాటిల్‌ – 5 కేసులు
  5. రామలింగారెడ్డి – 4 కేసులు
  6. బీజే జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ – 5 కేసులు
  7. కేహెచ్‌ మునియప్ప -1 కేసులు
  8. డాక్టర్‌ జీ పరమేశ్వర – 3 కేసులు
  9. ప్రియంక ఖర్గే – 9 కేసులు

Latest News

More Articles