Tuesday, May 7, 2024

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నటుడు రే స్టీవెన్సన్ హఠాన్మరణం

spot_img

హైదరాబాద్‌: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో బ్రిటిష్‌ గవర్నర్‌గా నటించిన రే స్టీవెన్సన్ హఠాన్మరణం చెందారు. 58 ఏండ్ల స్టీవెన్‌సన్‌ మరణానికి గల కారణాలు తెలియరాలేదు. ఆయన మృతిపట్ల ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేసింది.

1964లో నార్త్‌ ఐర్లాండ్‌లోని లిస్‌బర్న్‌లో స్టీవెన్సన్ జన్మించారు. ఎనిమిదేండ్ల వయస్సులో ఇంగ్లండ్‌ చేరుకున్నారు. 29 ఏండ్ల వయసులో టీవీ షోల్లో నటించడం ప్రారంభించారు. 1998లో పాల్‌ గ్రీన్‌గ్రాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ద థియరీ ఆఫ్‌ ఫ్లైట్‌’తో సినిమారంగ ప్రవేశం చేశారు.

Latest News

More Articles