Friday, May 17, 2024

ప్రజల జీవన విధానం లోనుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ

spot_img

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు “సద్దుల బతుకమ్మ”ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం లోనుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని సీఎం అన్నారు. దేవీదేవతలను అర్చించే పువ్వులే బతుకమ్మగా పూజలందుకోవడం తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధనను, కృతజ్ఞతాభావనను తెలియజేస్తుందని సీఎం అన్నారు. సబ్బండ వర్గాలు సమిష్టిగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదని సీఎం తెలిపారు.

పచ్చదనం, పాడి పంటలు, పశుసంపద, ప్రకృతి వనరుల సమృద్ధితో నేడు తెలంగాణ రాష్ట్రం నిండైన బతుకమ్మను తలపిస్తున్నదని అన్నారు. బతుకమ్మల నిమజ్జన సమయంలో స్వీయ జాగ్రత్తలతో పాటు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలనీ జగన్మాత గౌరీదేవిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రార్థించారు.

Latest News

More Articles