Saturday, May 18, 2024

పునీత్‌ ఎప్పటికీ మన మధ్యే.. శివ రాజ్‌కుమార్‌ ఎమోషనల్

spot_img

బెంగళూరు: తన సోదరుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు నటుడు శివ రాజ్‌కుమార్‌. జ్ఞాపకాల రూపంలో పునీత్‌ ఎప్పటికీ మన మధ్యే ఉంటారని ఆయన చెప్పారు. జ్ఞాపకాలు, సినిమాలకు అతీతంగా చేసిన అద్భుతమైన సేవల రూపంలో అతడు ఎప్పుడూ తమవెంటే సజీవంగానే ఉంటాడని ఎమోషనల్ అయ్యారు. పునీత్‌ మరణం పట్ల బాధ ఉన్నప్పటికీ ముందుకు సాగక తప్పదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

Also Read.. కిషోర్ ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే..  మొత్తం తుంగతుర్తికి దళిత బంధు

కన్నడ సీనియర్ నటుడు రాజ్‌కుమార్‌ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పునీత్‌.. తక్కువ కాలంలోనే స్టార్‌ హోదా దక్కించుకున్నారు. ‘అప్పు’, ‘అభి’, ‘అజయ్‌’, ‘బిందాస్‌’, ‘జాకీ’, ‘రానా విక్రమా’, ‘రాజకుమార’ వంటి సినిమాలతో పవర్ స్టార్ గా గుర్తింపుపొందారు. అక్టోబర్‌ 29, 2021లో వర్కౌట్స్‌ చేస్తున్న సమయంలో కార్డియాక్‌ అరెస్ట్‌తో పునీత్ కన్నుమూశారు.

Latest News

More Articles