Sunday, May 19, 2024

లోన్‎యాప్ వేధింపులకు హైదరాబాద్‎లో యువకుడు బలి

spot_img

లోన్‎యాప్ వేధింపులకు హైదరాబాద్‎లో మరో యువకుడు బలయ్యాడు. నిర్వాహకుల వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈస్ట్ గోదావరికి చెందిన శివ.. తల్లిదండ్రులతో కలిసి ఎల్లారెడ్డి గూడలో నివాసం ఉంటున్నాడు. శివ తన అవసరాల నిమిత్తం పలు లోన్‎యాప్స్‎లో లోన్ తీసుకున్నాడు. లోన్ అధిక మొత్తంలో చెల్లించాలని నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరగడంతో శివ.. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. శివ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles