Sunday, May 12, 2024

దాసోజు శ్రవణ్, సత్య నారాయణ పిటిషన్‌పై హైకోర్టు విచారణ

spot_img

హైదరాబాద్: దాసోజు శ్రవణ్, సత్య నారాయణ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన దాసోజు శ్రవణ్ , సత్య నారాయణ లను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దీంతో వారు హై కోర్టును ఆశ్రయించారు.

Also Read.. ఈనెల 25వ తేదీన బల నిరూపణకు సిద్ధం 

ఆర్టికల్ 171 ప్రకారం క్యాబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీలు లేదని శ్రవణ్, సత్యనారాయణ తరుపు న్యాయవాదులు వాదించారు. కాగా, ఆర్టికల్ 361 ప్రకారం ఈ పిటిషన్ కు అర్హత లేదని గవర్నర్ తరుపు కౌన్సిల్ వాదనలు వినిపించారు. అయితే, పిటిషన్ మెంటేనబిలిటీపై విచారణ జరుపుతామని హై కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ జనవరి 24 కు వాయిదా వేసింది.

Latest News

More Articles