Friday, May 17, 2024

పదహారేళ్ల అమ్మాయిని మనువాడిన 65 ఏళ్ల మేయర్‌

spot_img

దక్షిణ బ్రెజిల్‌లోని పదహారేళ్ల అమ్మాయిని అరౌకారియా నగర మేయర్‌ హిస్సామ్‌ హుసేన్‌ దేహైని 65 ఏళ్ల వయసులో మనువాడటం చర్చనీయాంశమైంది. బ్రెజిల్‌ చట్టాల ప్రకారం.. 16 ఏళ్లు దాటిన అమ్మాయిలు తల్లిదండ్రుల అనుమతితో ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చంట. మరోవైపు మేయర్‌ హిస్సామ్‌ హుసేన్‌ దేహైని పై వచ్చిన అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపైన విచారణ సంస్థలు దర్యాప్తు మొదలుపెట్టాయి.

అమ్మాయికి 16 ఏళ్లు దాటిన మరుసటిరోజే.. వివాహం తంతు జరిపించుకున్న మేయర్.. మరో చేత్తో.. పిల్లనిచ్చిన తల్లి (అత్త)కి ప్రమోషన్ కూడా ఇచ్చేశారట. పెళ్లికి ముందు విద్యాశాఖలో చిన్న ఉద్యోగంలో ఉన్న అత్తగారిని.. ఏకంగా స్థానిక ప్రభుత్వంలో సాంస్కృతిక, పర్యటకశాఖ కార్యదర్శిగా పదోన్నతి ఇవ్వడంపై అక్కడ దుమారం రేపుతోంది. ఈ విషయాన్ని డిప్యూటీ మేయర్‌ సీమా బయటపెట్టడంతో మేయర్ అవినీతి, బంధుప్రీతిపై విచారణ మొదలైందట.

Latest News

More Articles