Thursday, May 2, 2024

చైనాలో ముస్లింలపై వేధింపులు.. ‘ఈద్‌’ ప్రార్థనలకు అనుమతి నిరాకరణ..!

spot_img

న్యూఢిల్లీ: వీగర్‌ ముస్లింలపై చైనా  దాష్టీకం ప్రదర్శిస్తోంది. ఈద్‌-ఉల్‌-ఫితర్‌ (రంజాన్ పర్వదినం) ప్రార్థనలకు కూడా అనుమతి పేరుతో వేధింపులకు గురిచేసిస ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్‌ 20-21 తేదీల్లో ఈద్‌ సందర్భంగా చైనాలోని షింజియాంగ్‌ ప్రావిన్స్‌లో ప్రార్థనలకు అనుమతించలేదని ‘రేడియో ఫ్రీ ఏషియా’ తన కథనంలో పేర్కొంది.

భారీ భద్రత మధ్య స్థానిక మసీదుల్లో 60 ఏళ్లు అంతకంటే పైబడిన వారిని మాత్రమే ప్రార్థనలకు అనుమతించారని, వారిపైనా గట్టి నిఘా పెట్టారని వివరించారు. అలాగే ఇళ్లల్లో కూడా ఎవరైనా ప్రార్థనలు చేస్తున్నారేమోనని తనిఖీలు చేశారట.

మరోవైపు ఈ వాదనలను చైనా సమర్థించుకొంది. చైనాలో మతపరమైన తీవ్రవాదాన్ని అణచివేయడానికే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది. చైనాలో 2017 నుంచి మత, జాతిపరమైన ఆచారాలను పాటించడంపై నిషేధం ఉంది.

Latest News

More Articles