Tuesday, May 21, 2024

30 నిమిషాలపాటు 9 వేల కోట్లకు అధిపతి అయిన క్యాబ్ డ్రైవర్

spot_img

చెన్నై: తమిళనాడు రాష్ట్రం పళని ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ అనే క్యాబ్ డ్రైవర్ 30 నిమిషాలపాటు 9 వేల కోట్లకు అధిపతి అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రాజ్ కుమార్ కు తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులో అకౌంట్ ఉంది. సెప్టెంబర్ 9న 9 వేల కోట్ల రూపాయలు డబ్బులు పడ్డట్టు మెసేజ్ వచ్చింది. కలలో కూడా ఊహించనంత అమౌంట్ అకౌంట్ లో ఉండటంతో.. వెంటనే క్యాబ్ కిస్తీగా కట్టాల్సిన 21 వేల రూపాయలను ట్రాన్స్ ఫర్ చేశాడు.

Also Read.. ప్రముఖ బాలీవుడ్ నటుడు మృతి

సరిగ్గా 30 నిమిషాల తర్వాత అకౌంట్లోని డబ్బులు మొత్తం వెనక్కి వెళ్లిపోయాయి. సెప్టెంబర్ 10న బ్యాంక్ అధికారులు రాజ్ కుమార్ ఉంటున్న ఇంటికి వచ్చారు. జరిగిన పొరపాటును చెప్పి.. 21 వేల రూపాయలు తిరిగి ఇవ్వాలని కోరారు. బ్యాంక్ అధికారుల తప్పుకు.. నేను ఎలా బాధ్యత వహిస్తానంటూ.. ఇప్పుడు డబ్బులు లేవని, ఉన్నప్పుడు ఇస్తానని చెప్పాడు. బ్యాంక్ అధికారులు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. దీంతో లాయర్ సాయంతో రాజ్ కుమార్ పోలీస్ స్టేషన్ లో తన వాదనలు వినిపించాడు.

Also Read.. సింగరేణి కార్మికుల ఖాతాల్లో రూ. 3.70 లక్షలు

చివరకు బ్యాంక్ అధికారులు తప్పును అంగీకరించి.. 21 వేల రూపాయలు తిరిగి ఇవ్వొద్దని.. అవసరం అయితే కారు లోన్ ఇస్తామంటూ ఆఫర్ చేశారు. ఇది జరిగిన 10 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తానికి 30 నిమిషాలపాటు 9 వేల కోట్లకు అధిపతి అయిన క్యాబ్ డ్రైవర్ అంటూ రాజ్ కుమార్ వ్యవహారం వైరల్ అవుతోంది.

More News..

Latest News

More Articles