Wednesday, May 22, 2024

రెండు తలలు, ఆరు కాళ్లతో ఆవు దూడ. పూజలు చేసిన ప్రజలు

spot_img

బీహార్‌ రాష్ట్రం జాముయ్‌ జిల్లా కొల్దిహ గ్రామంలో ఇటీవల ఈ వింత చోటుచేసుకుంది. కొల్దిహ గ్రామంలో ఓ రైతు ఇంట్లో రెండు తలలు, ఆరు కాళ్లతో వింత ఆవు దూడ జన్మించింది. జన్యుపరమైన లోపాల కారణంగా ఇలాంటివి జరుగుతుంటాయని వెటర్నరీ డాక్టర్లు చెప్పారు.

వింత ఆవు దూడ విషయం తెలియగానే చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దైవం అంటూ ఆ లేగ దూడకు పూజలు చేయడం మొదలుపెట్టారు. అయితే, మరుసటి రోజు ఆ లేగ దూడ ప్రాణాలు కోల్పోయింది.

Latest News

More Articles