Tuesday, May 21, 2024

నల్లగొండ జిల్లాలో ఏరోప్లేన్ ఆకారంలో ఉన్న డ్రోన్ కలకలం..!

spot_img

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో హెలికాప్టర్ ఆకారంలో ఉన్న డ్రోన్ పంటపొలాల్లో లభ్యం కావడం కలకలం సృష్టించింది. పంటపొలాల్లో ఏరోప్లేన్ ఆకారంలో ఉన్న డ్రోన్ ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఏరోప్లేన్ లాంటి డ్రోన్ ను స్వాధీనం చేసుకొని శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు దీన్ని ఆపరేట్ చేశారు? అన్న విషయాలపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Latest News

More Articles