Friday, May 17, 2024

చూస్తుండగానే.. యువకుడిపై షార్క్‌ దాడి చేసి చంపి తినేసింది..!

spot_img

ఈజిప్టులోని ఒక బీచ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఈతకొడుతున్న యువకుడిపై షార్క్‌ దాడి చేసి చంపేసి తినేసింది. యువకుడి తండ్రితో పాటు పలువురు చూస్తుండగానే ఈ విషాదం జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఈజిప్ట్‌లోని హుర్గడా రిసార్టు బీచ్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. రష్యాకు చెందిన 23 ఏండ్ల యువకుడు వ్లాదిమిర్‌ పాపొవ్‌ తండ్రితో కలిసి బీచ్‌లో ఈతకొడుతున్నాడు. హఠాత్తుగా ప్రత్యక్షమైన టైగర్‌ షార్క్‌ అతడిపై దాడి చేసి నీటిలోకి లాక్కెళ్లి చంపి తినేసింది.

Latest News

More Articles