Sunday, May 19, 2024

మాదాపూర్‌లో వేగంగా వెళ్తున్న కారులో మంట‌లు..తప్పిన ప్రమాదం

spot_img

హైదరాబాద్ మాదాపూర్, కేపీహెచ్‌బీ కాల‌నీల మ‌ధ్య ఘోరం జ‌రిగింది. ఈ మార్గంలో వేగంగా వెళ్తున్న కారులో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అలర్టైన  డ్రైవ‌ర్ వెంటనే కారును ఆపేశాడు. అందులో ఉన్న ప్ర‌యాణికుల‌ను కింద‌కు దించేశాడు. ఇంజిన్‌లో నుంచి మంట‌లు చెల‌రేగిన‌ట్లు డ్రైవ‌ర్ తెలిపాడు.

స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పేశారు. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే ఇంజిన్‌లో మంట‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్ర‌మాదంలో కారు పూర్తిగా దగ్ధ‌మైంది. కారులో మంట‌లు చెల‌రేగ‌డంతో మాదాపూర్- కేపీహెచ్‌బీ మ‌ధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ట్రాఫిక్ పోలీసులు కారును రోడ్డు ప‌క్క‌కు జరిపించి..ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు.

ఇది కూడా చదవండి: పతంజలిపై కఠిన చర్యలు తీసుకోండి

Latest News

More Articles